అంగన్‌వాడీల 'ఛలో విజయవాడ 'నిరసనలో ఉద్రిక్తత !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీలు తలపెట్టిన 'ఛలో విజయవాడ' ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు బయల్దేరిన అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, ధర్నాచౌక్, ప్రకాశం బ్యారేజ్,రామవరప్పాడు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అరెస్ట్ చేసిన అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేసి భవానీపురం, సూర్యాపేట, గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అంగన్వాడీలు ఛలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతంగా మారిన క్రమంలో అంగన్ వాడీల యూనియన్ లీడర్లు పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంగన్ వాడీల ఆందోళనకు మద్దతు తెలిపిన టీడీపీ లీడర్లను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన డిమాండ్లను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో అంగన్వాడీల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)