సిబిఐ కస్టడీలో అధికారి ఆత్మహత్య !

Telugu Lo Computer
0


గుజరాత్ లోని రాజ్‌కోట్‌ లో లంచం తీసుకుంటూ శుక్రవారం  కార్యాలయంలో సిబిఐ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన రాజ్‌కోట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) జాయింట్ డైరెక్టర్ జావ్రీ మల్ బిష్ణోయ్ శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గాయాలతో ఉన్న ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు రాజ్‌కోట్ పోలీసు కమిషనర్ రాజు భార్గవ్ శనివారం తెలిపారు. రాజ్‌కోట్ రూరల్ ఎస్‌పి కార్యాలయం ఎదురుగా ఉన్న డిజిఎఫ్‌టి కార్యాలయంలో ఉదయం 10 గటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. శుక్రవారం రూ. 5 లక్షల లంచం పుచ్చుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన బిష్ణోయ్‌ను అరెస్టు చేసిన తర్వాత సిబిఐ అధికారులు డిజిఎఫ్‌టి ఆఫీసు ప్రాంగణాన్ని, రాజ్‌కోట్‌లోని ఇంటితోపాటు స్వగ్రామంలోని ఇంటిని సోదా చేస్తున్న తరుణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒక ఎక్స్‌పోర్టర్ నుంచి రూ. 5 లక్షల లంచం తీసుకుంటుండగా 44 ఏళ్ల బిష్ణోయ్‌ను సిబిఐ అధికారులు నేరుగా పట్టుకున్నారు. ఫుడ్ క్యాన్ ఎక్స్‌పోర్ట్ వ్యాపారంలో ఉన్న ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసిన సిబిఐ అధికారులు వలపన్ని బిష్ణోయ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు రూ. 9 లక్షల లంచాన్ని ఎక్స్‌పోర్టర్ నుంచి బిష్ణోయ్ డిమాండ్ చేసినట్లు సిబిఐ కేసు నమోదుచేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)