అవిసె లడ్డు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


కోవిడ్ తర్వాత అందరికీ హెల్త్‌పై ఫోకస్ పెరిగింది. డైట్ మారింది. జంక్ ఫుడ్ సాధ్యమైనంతవరకు అవౌడ్ చేస్తున్నారు. కొద్దో గొప్పో.. షర్ట్ తడిసేలా వర్కువుట్స్ చేస్తున్నారు. అయితే ప్రకృతి వైద్యులు మంతెన చెప్పే టిప్స్‌ను ఇప్పుడు యూత్ చాలామంది పాటిస్తున్నారు. వంటింటి చిట్కాలతోనే ఆయన చెప్పే రెమిడీస్ యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. రక్తనాళాల్లో పేరుకుపోయే కొవ్వు, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ చాలా డేంజర్. ముఖ్యంగా హార్ట్‌లో, బ్రెయిన్‌లో ఇలా కొవ్వు, కొలెస్ట్రాల్ చేరితే గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. రక్తనాళ్లలో ఈ కొవ్వు లేదా కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉండటానికి ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది. అవిసె గింజుల్లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అవిసె గింజుల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే మంచి కొవ్వు కూడా ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. దాదాపు 27 పరిశోధనలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. 30 రోజులపాటు రోజు 25 నుంచి 30 గ్రాములు అవిసె గింజల్ని తింటే.. హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకావం నెల రోజుల్లోనే 15 శాతం తగ్గిందని సైంటిఫిక్‌గా ప్రూవ్ అయ్యింది. అంతేకాదు గుండెజబ్బులు వచ్చి స్టంట్స్, బైపాస్ ఆపరేషన్స్ చేయించుకున్నవారు.. లేదా బ్లాక్స్ వచ్చినవారు కూడా ఈ అవిసె గింజల్ని రోజుకు 25 గ్రాములు తీసుకుంటే.. భవిష్యత్ వారికి గుండెజబ్బులు తిరగబెట్టే ప్రమాదం ఉండదట. ముందుగా అవిసె గింజల్ని మాడకుండా దోరగా వేయించి.. పక్కన పెట్టుకోవాలి. ఆపై గింజలు తీసిన ఖర్జూరం ముక్కలను తీస్కోని.. దానిలో కొంత తేనె వేసి.. పోయిపై పెట్టి 2 నిమిషాలు వేడి చేయాలి. ఆపై వేపిన అవిసె గింజల్ని అందులో కలిపి లడ్డూలుగా చేసుకోండి. అలా రోజు ఒక అవిసె లడ్డూ తింటే మీకు తిరుగుండదు.

Post a Comment

0Comments

Post a Comment (0)