లవ్‌ జిహాద్‌గా పరిగణించలేం !

Telugu Lo Computer
0


యువతీ యువకులు వేర్వేరు మతాలకు చెందినవారనే ఒక్క కారణంపైనే వారి బంధాన్ని లవ్‌ జిహాద్‌గా పరిగణించలేమని బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచి స్పష్టం చేసింది. ఈ కేసులో అరెస్టు కాకుండా ఒక ముస్లిం యువతికి, ఆమె కుటుంబానికి ఇటీవల ముందస్తు బెయిలు ఇచ్చింది. అంతకుముందు ఔరంగాబాద్‌లో ఒక స్థానిక కోర్టు వారికి బెయిలు నిరాకరించింది. తనను ఇస్లాంలోకి మారి, సున్తీ చేయించుకునేటట్లు ఆమె కుటుంబం బలవంతపెట్టిందని ముస్లిం యువతి మాజీ ప్రేమికుడు ఆరోపించారు. వారికి బెయిలు నిరాకరించాలంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇది లవ్‌ జిహాద్‌ అని చెప్పారు. ఈ వాదాన్ని హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ముస్లిం మహిళతో తనకు సంబంధం ఉందని ఎఫ్‌.ఐ.ఆర్‌.లో ఒప్పుకున్న పురుషుడు, తర్వాత పలు అవకాశాలు దొరికినా ఆ సంబంధాన్ని తెంచుకోలేదని తెలిపింది. తాను దళితుడిననే విషయాన్ని వాది దాచిపెట్టాడని, ఇస్లాంలోకి మారి పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తెచ్చినప్పుడు తన కులం గురించి యువతి తల్లిదండ్రులకు తెలిపినా వారు అభ్యంతర పెట్టలేదని న్యాయవాదులు పేర్కొన్నారు. సంబంధాలు చెడటంతో లవ్‌ జిహాద్‌గా చెబుతున్నారని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)