సత్యనారాయణ స్వామి దేవాలయంలో నిఖా !

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లా రాంపూర్ గ్రామంలో సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. ఈ గుడి ప్రాంణంలోనే విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయాలు కూడా వున్నాయి. గ్రామంలోని ఓ ముస్లిం కుటుంబంలో వివాహం నిశ్చయమైంది. దీన్ని గమనించిన వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు  సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో పెళ్లి వేడుక చేయాలని ఆ ముస్లిం కుటుంబాన్ని కోరారు. వారు కూడా అందుకు అంగీకరించడంతో ఈ వివాహ వేడుకకు హిందువులు, ముస్లింలు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. మౌల్వీ, సాక్షులు, లాయర్ సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ప్రజల మధ్య సోదరభావాన్ని పెంచేందుకు, మత సామరస్య సందేశాన్ని చాటేందుకు దేవాలయంలో నిఖా జరిపించినట్టు హిందూ సంఘాల ప్రతినిధులు తెలిపారు. సనాతన హిందూ ధర్మం అందరినీ కలుపుకుని వెళ్లాలని స్పష్టం చేస్తుందని, మనుషులంతా ఒక్కటే అని చాటి చెబుతుందని, అందుకే ముస్లిం జంట పెళ్లిని సత్యనారాయణ స్వామి ఆలయంలో ముస్లిం మత ఆచారం ప్రకారం నిర్వహించటానికి అనుమతించినట్లు టెంపుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ వినయ్ శర్మ తెలిపారు. హిందూ సంస్థలు ముస్లింలకు వ్యతిరేకం అంటూ తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. కానీ ఇక్కడ ఓ ముస్లిం జంట పెళ్లి గుడిలో జరిగిందని, మునుషుల మధ్య రాజకీయం ఉండకూడదని ఆయన అన్నారు. గుడిలోని ముస్లిం జంట పెళ్లికి రాంపూర్ గ్రామస్తులతోపాటు.. హిందూ పరిషత్ ప్రతినిధులు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా వధువు తండ్రి మాలిక్ మాట్లాడుతూ 'నా కుటుంబానికి, నా కుమార్తె వివాహానికి విశ్వహిందూ పరిషత్, ఆలయ ట్రస్ట్, స్థానికులు ఎంతో అండగా నిలిచారు. దగ్గరుండి పెళ్లిని నడిపించారు' అంటూ అభినందనలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)