అమెరికాలో ప్రవాస భారతీయుల నిరసన - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 25 March 2023

అమెరికాలో ప్రవాస భారతీయుల నిరసన


అమెరికాలోని కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయం ప్రాంగణం లో వందలాది మంది భారతీయ-అమెరికన్ మద్దతుదార్లు ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మార్చి 24 శుక్రవారం సాయంత్రం 3 గంటలకు భారత్ కు అనుకుంగా నినాదాలు చేశారు. మార్చి 19న, 2023 ఆదివారం నాడు శాన్ ప్రాన్సిస్కో నగరంలో ఉన్న భారత కాన్సులేటు కార్యాలయ అద్దాలను ఖలిస్తాన్ అందోళకారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.  దానికి నిరసనగా ప్రవాస భారతీయులు భారత కాన్సులేట్ ఆఫీస్ బయట సమావేశమమ్యారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి.. వందేమాతరం, భారతమాతకు జై అంటూ నినాదాలు చేశారు. పలు దేశభక్తి పాటలు పాడారు. ప్రవాస భారతీయులు అక్కడి చేరుకోగానే ఖలిస్తాన్ వేర్పాటువాదులు నినాదాలు చేశారు. ప్రతిగా భారతీయులు నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతా నినాదాలు, దేశభక్తి పాటలతో మారుమోగింది. అక్కడి చేరుకున్న పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకున్నారు. మరో వైపు శాక్రమెంటో నగరంలో భారత, అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాక్రమెంటో తెలుగు సంఘం సభ్యులు హాజరయ్యారు. రాఘువ్, మనహోర్, వెంకట్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాన్సులేట్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్, కాన్సుల్ ఆకున్ సబర్వాల్ ను వారు కలిశారు. ఆ శాంతి ర్యాలిలో పలువురు భారత అనుకూల ముస్లింలు, సిక్కులు, ఇతర ప్రవాసులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment