మారియన్ బయోటెక్ కు చెందిన ముగ్గురు అధికారుల అరెస్టు

Telugu Lo Computer
0


భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు మందును వాడడం వల్ల ఉజ్బెకిస్థాన్‌ లో 18 మంది చిన్నారులు మరణించిన కేసులో ఆ కంపెనీకి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు గురువారం రాత్రి మారియన్ బయోటెక్ కి చెందిన ఇద్దరు డైరెక్టర్లు సహా ఐదుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఇవాళ ముగ్గురిని అరెస్టు చేశారు. కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్ డ్రగ్స్ అధికారులు మారియన్ బయోటెక్ నుంచి శాంపిల్స్ సేకరించి 22 ఔషధాలు నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్లు లేవని నిర్ధారించారని ఫిర్యాదులో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు. ఇవాళ అరెస్టయిన వారిలో తుహీన్ భట్టాచార్య, అతుల్ రావత్, మూల్ సింగ్ ఉన్నారని పోలీసులు వివరించారు. కాగా, మారియన్ బయోటెక్ పై గత ఏడాది డిసెంబరు నుంచి విచారణ జరుగుతోంది. తమ దేశంలో 18 మంది చిన్నారుల మృతికి భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందే కారణమని ఉజ్బెకిస్థాన్‌ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. మారియన్ బయోటెక్ తయారు చేసిన డాక్-1 మాక్స్ సిరప్ ను చిన్నారులు పేర్కొంది. అంతకు ముందు కూడా గాంబియాలో 70 మంది చిన్నారులు భారత ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారుచేసిన దగ్గు మందు తాగి మృతి చెందిన ఘటన మరవకముందే ఉజ్బెకిస్థాన్‌ లోనూ అటువంటి ఘటనే చోటుచేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆ ఘటనలను సీరియస్ గా తీసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)