హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నివాసముంటున్న ప్రముఖ రచయిత్రి, ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం వయోభారంతో కన్నుమూశారు. 1930 డిసెంబరు 31న కోటనందూరులో జన్మించిన ఆమె మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. 1951 నుంచి రచనలు ప్రారంభించారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్ర సాహిత్యం అభ్యసించారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీషు విభాగానికి ఉప సంపాదకులుగా పనిచేశారు. స్త్రీ సంక్షేమ సంస్థల్లో విధులు నిర్వర్తించారు. 1954లో కవి, సాహిత్య విమర్శకుడు ఆరుద్రతో రామలక్ష్మికి వివాహమైంది. ఆ తర్వాత 'రామలక్ష్మి ఆరుద్ర' కలం పేరుతో రచనలు చేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు.
No comments:
Post a Comment