మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 4 March 2023

మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు


మనీష్ సిసోడియాకు సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. కేసు దర్యాప్తుకు మనీష్ సిసోడియా సహకరించడం లేదన్న సీబీఐ, మరో మూడురోజుల పాటు కస్టడి పొడిగించాలని కోరింది. రెండు రోజులపాటు కస్టడి పొడిగించడంతో రౌస్ అవెన్యూ కోర్టు నుంచి సీబీఐ కేంద్ర కార్యాలయానికి సిసోడియాను తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా ఎ-1 గా ఉన్నారు. ఐదు రోజుల కస్టడీ ముగియడంతో మనీశ్ సిసోడియాను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. విచారణకు మనీశ్ సిసోడియా సహకరించట్లేదని సీబీఐ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 5 రోజుల కస్టడీలో ప్రతి రోజు రాత్రి 8 గంటల వరకు ప్రశ్నించామని దర్యాప్తు బృందం తెలిపింది. కనపడని ఫైల్స్ ఆధారాల కోసం సిసోడియాను ప్రశ్నించాల్సి ఉందన్నారు. మనీష్ సిసోడియాను మరో మూడు రోజుల కస్టడీని సీబీఐ కోరింది. మరో 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె. నాగ్ పాల్ ను కోరారు. దీంతో మనీష్ సిసోడియా కస్టడీని కోర్టు రెండు రోజులు పొడిగించింది. మరోవైపు మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపును సిసోడియా తరపు న్యాయవాది ధ్యాన్ కృష్ణన్ వ్యతిరేకించారు. సిసోడియాను బలవంతంగా ఒప్పించేలా సీబీఐ ప్రవర్తిస్తోందని వాదించారు. కస్టడీలో సిసోడియా ఉంటే కనపడకుండా పోయిన ఫైల్స్ ఆధారాలు వస్తాయా? అని ధ్యాన్ కృష్ణన్ ప్రశ్నించారు. కస్టడీ పొడిగింపుపై సమగ్ర విచారణ జరపాలని వాదించారు. సిసోడియా బెయిల్ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని సీబీఐకి కోర్టు నోటీసులు ఇచ్చింది. కాగా, కస్టడీని సవాల్ చేయాలనుకుంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. మార్చి10వ తేది మధ్యాహ్నం 2 గంటలకు సిసోడియా బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.

No comments:

Post a Comment