ఎవరీ విజయప్రియ నిత్యానంద ?

Telugu Lo Computer
0


జెనీవాలోని ఐక్యరాజ్యసమితి సమావేశానికి కల్పిత దేశం కైలాస దేశ ప్రతినిధి హాజరయ్యారు. అత్యాచార నిందితుడు, స్వయం ప్రకటిత దైవం నిత్యానంద స్థాపించిన కాల్పనిక దేశం కైలాస ప్రతినిధి విజయప్రియ యుఎన్ సమావేశానికి హాజరవడం అందరిని ఆశ్చర్యానికిి గురి చేసింది. విజయప్రియ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమె కెనడాలోని మనిటోబా యూనివర్శిటీ నుంచి మైక్రోబయాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. మెరుగైన విద్యార్థిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. కాలేజీలో ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు డీన్ ఆనర్ జాబితాలో ఆమె పేరును కూడా చేర్చారు. 2013, 2014 సంవత్సరాల్లో ఆమె ఇంటర్నేషనల్ యూజీ స్టూడెంట్ స్కాలర్ షిప్ ను సాధించారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, పెజిన్స్, క్రియోల్ భాషలను ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. అయితే ఆమె ఏ దేశానికి చెందినవారనే అంశంలో మాత్రం స్పష్టత లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)