నేనేం నిద్రపోవడం లేదు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 27 March 2023

నేనేం నిద్రపోవడం లేదు !


నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్నా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా అవేర్నెస్ తీసుకురావడంలో దిట్ట.  తాజాగా మరో ఇంటస్ట్రింగ్ పోస్టు చేశారు. ఫొటోలో మంత్రి మొబైల్ ఫోన్ చూస్తూ కూర్చున్నారు. ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ ఫొటోకు.. అదిరిపోయే హ్యూమర్ టచ్ కూడా ఇచ్చారు. "నేనేం నిద్రపోవడం లేదు. జస్ట్ నా నెక్స్ట్ ట్వీట్‌ను డ్రాఫ్ట్‌ చేసుకుంటున్నానంతే.." అంటూ మంత్రి తెంజెన్ ఓ క్యాప్షన్ ను రాసుకొచ్చారు. ఈ ఫొటోలో తెంజెన్ ఫార్మల్ లుక్ లో ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ పోస్ట్ కు షేర్ చేసిన గంటల్లోనే 2.7లక్షలకు పైగా వ్యూస్, 12వేల లైకులు వచ్చాయి. ఈ పోస్టుపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఫన్నీ ఎమోజీలు పెడుతూ కామెంట్ చేస్తున్నారు. నా చిన్నప్పుడు నేను కూడా ఇలాగే చేసే వాడిని చేతిలో బుక్ పెట్టుకుని నిద్రపోయేవాడిని. నాన్న అడిగితే...ఫార్ములా గుర్తు చేసుకుంటున్నా అని చెప్పేవాడిని.. అంటూ ఓ వ్యూయర్ రిప్లై ఇచ్చాడు. ఇలా ఫన్నీ ట్వీ్ట్స్ చేయడం తెంజెన్ కు కొత్తేం కాదు. అంతకుముందు నాగాలాండ్‌ టూరిజంను ప్రమోట్ చేసేందుకు సరికొత్త రీతిలో పోస్ట్ చేశారు. "మీరు స్పైడర్ మేన్, సూపర్ మేన్‌లను చూసుండొచ్చు. ఇప్పుడు మీకు నేను T మ్యాన్ ని పరిచయం చేస్తున్నా. T అంటే తెంజెన్ మాత్రమే కాదు. టూరిజం కూడా. నాగాలాండ్‌ను విజిట్ చేయాలనుకుంటున్నారా..? నాతో పాటు వచ్చేదెవరు..?" అంటూ ట్వీట్ చేశారు. 

No comments:

Post a Comment