గుజరాత్‌ మహిళా కాంగ్రెస్‌ నేత అరెస్టు

Telugu Lo Computer
0


గుజరాత్‌కు చెందిన మహిళా కాంగ్రెస్‌ నేత మేఘనా పటేల్‌ను విదేశీ మద్యం అక్రమ రవాణా కేసులో అరెస్టు చేశారు.  బొలెరో కారులో విదేశీ మద్యం స్మగ్లింగ్‌ చేస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పిప్లాడ్‌ రోడ్డు ప్రాంతంలో మేఘనా పటేల్‌ కారును ఆపి చెక్‌ చేశారు. ఈ సందర్బంగా కారు నడుపుతున్న వ్యక్తిని తనిఖీ చేయగా  మేఘనా పటేల్ కోసం రూ.7.5 లక్షలకు పైగా విలువైన విదేశీ మద్యం తీసుకొచ్చినట్లు తేలింది.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో, విదేశీ మద్యాన్ని పోలీసులు సీజ్ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, ఈ విదేశీ మద్యం ఎక్కడ నుంచి వచ్చింది.. దీన్ని ఎవరు విక్రయించారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మేఘనా పటేల్‌, కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా, మేఘనా పటేల్ మాజీ మహిళా ఉపాధ్యక్షురాలుగా పని చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)