వరపుల రాజా కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

Telugu Lo Computer
0


టీడీపీ నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ వరపుల రాజా అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం జగన్‌ అధికారికంగా చెప్పినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నబాబు ప్రకటించారు వరుపుల రాజా మరణం చాలా భాధాకరమన్నారు మాజీ మంత్రి , ఎమ్మెల్యే కన్నబాబు. రాజా మరణవార్త విని సీఎం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారని,ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ఆదేశించినట్లు కన్నబాబు తెలిపారు. 1976 ఆగస్టు 14న జన్మించిన వరుపుల రాజా 2004లో మండలాధ్యక్షుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో డీసీసీబీ ఛైర్మన్‌ చేశారు. తర్వాత ఆప్కాబ్‌ వైస్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి MLAగా పోటీ చేసిన ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరిలో కీలక నేతగా ఎదగుతున్న దశలో హఠాన్మరణం సన్నిహితుల్ని, పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)