బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు !

Telugu Lo Computer
0


బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు పెంచుకుంటూ రావడంతో బ్యాంకులు అన్నీ కూడా వరుస పెట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు పెంచేశాయి. ఈ క్రమంలో ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ కూడా ఇదే దారిలో పయనించింది. మార్చి 4 నుంచి వడ్డీ రేట్ల పెంపు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించిది. రేట్ల పెంపు తర్వాత చూస్తే.. సీనియర్ సిటిజన్స్‌కు ఇప్పుడు గరిష్టంగా 8.2 శాతం వరకు వడ్డీ వస్తోంది. 44 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అంతేకాకుండా బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను గరిష్టంగా 35 బేసిస్ పాయింట్లు పెంచేసిందని చెప్పుకోవచ్చు. 15 నెలల నుంచి 23 నెలల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది. 60 ఏళ్లకు లోపు వయసు కలిగిన వారు గరిష్టంగా 7.95 శాతం వడ్డీ పొందొచ్చు. అలాగే స్పెషల్ టెన్యూర్ 33 నెలల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7.75 శాతంగా ఉంది. రెగ్యులర్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లలో డబ్బులు దాచుకునే వారు అధిక రాబడి పొందొచ్చని బాజజ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇన్వెస్ట్‌మెంట్లు) తెలిపారు. తాజా వడ్డీ రేట్ల పెంపు తర్వాత చూస్తే.. 44 నెలల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 8.2 శాతానికి చేరిందని పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)