ఏథర్ 450ఎక్స్ బైక్‌కు చలానా ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 21 March 2023

ఏథర్ 450ఎక్స్ బైక్‌కు చలానా !


కేరళ లోని మలప్పురం జిల్లా నీలంచెరిలో ఇటీవల కాలుష్య రహిత ఏథర్ 450ఎక్స్ బైక్‌కు చలానా వేశారు. అది కూడా పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని. పోనీ పొరపాటున వేశారా ? అని అనడానికి లేదు. ఆ బండికి ఆకుపచ్చ లైసెన్స్ ప్లేట్‌ కనిపిస్తూనే ఉంది. అయినా జరిమానా వడ్డించేశారు. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 213(5)(ఈ) నిబంధన ఉల్లంఘించినందుకు రూ. 250 జరిమానా విధించినట్లు చలానాలో పోలీసులు తెలిపారు. దీంతో యజమాని షాక్ కు గురయ్యాడు. వెంటనే ఆ ఫొటోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

No comments:

Post a Comment