జై బాలయ్య, జై జై బాలయ్య : అలేఖ్య రెడ్డి

Telugu Lo Computer
0


నందమూరి బాలకృష్ణ కొడుకులా ఆప్యాయంగా చూసుకున్న తారకరత్న నారా లోకేష్ పాదయాత్ర సమయంలో గుండెపోటుకు గురై దాదాపు 23 రోజులు పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 22వ తేదీన తుది శ్వాస విడిచారు. తారకరత్న వైద్యం విషయంలోనూ, తారకరత్న మరణించిన తర్వాత నిర్వహించిన కార్యక్రమాల విషయంలోనూ బాలయ్య ముందుండే అన్ని నడిపించారు. ముక్కు సూటి మనస్తత్వంతో ఉండే బాలయ్య తాను చేసే పని ఏదైనా సరే నిక్కచ్చిగా చేసి తీరుతారు. ఈ క్రమంలో బాలయ్య తారకరత్న కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని, పిల్లల బాధ్యత తనదేనని, భర్త మరణించిన తీవ్ర ఆవేదనలో ఉన్న అలేఖ్య రెడ్డికి భరోసా ఇచ్చారు. తాజాగా తన గొప్ప మనసును చాటుకుంటూ బాలయ్య తారకరత్న జ్ఞాపకార్థం గుండెపోటు సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. గుండె సమస్యలతో బాధపడుతూ చికిత్స ఖర్చులు భరించలేని పేదవారికి పూర్తిగా ఉచితంగా వైద్యం అందించాలని బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బసవతారకం ఆసుపత్రిలో ఒక బ్లాక్ ను ఏర్పాటు చేసి ఆ బ్లాక్ కు తారకరత్న బ్లాక్ అని నామకరణం చేశారు. గుండె సమస్యలకు ఉచిత వైద్యం బసవతారకం ఆసుపత్రి తో పాటు హిందూపురంలో బాలకృష్ణ నిర్మిస్తున్న ఆసుపత్రిలో కూడా అందుబాటులో ఉంటుంది.  అలేఖ్య రెడ్డి పెట్టిన పోస్టులో నేనేం చెప్పగలను, మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయగలను. నేనేం చెప్పినా, ఏం చేసినా చాలా తక్కువగానే ఉంటుంది. మీరు బంగారం లాంటి హృదయం ఉన్న వ్యక్తి అని మరోసారి నిరూపితమైంది. మీరు నిజంగా ఆ పేరుకు అర్హులు అంటూ బాలకృష్ణను ఉద్దేశించి అలేఖ్య రెడ్డి పోస్ట్ పెట్టారు. మీరు తప్ప ఇటువంటి పని ఎవరు చేయలేరు అంటూ ఆమె పేర్కొన్నారు. ఒక తండ్రిగా ఒక స్నేహితుడిగా ఇంత కాలం ఉన్న మీలో ఇప్పుడు దేవుడిని చూస్తున్నాను అంటూ అలేఖ్య రెడ్డి ఎమోషనల్ అయ్యారు. మీరు చేసిన చర్యతో నాకు నోటి మాట రావడం లేదని పేర్కొన్నారు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతగా మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అంటూ జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ అలేఖ్య రెడ్డి పోస్ట్ పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)