దేశంలో కొత్తగా 1,890కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


గడిచిన 24 గంటల్లో 1,890కరోనా కేసులు నమోదువగా, ఐదుగురు మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు, కేరళలో ముగ్గురు మరణించినట్లు తెలిపింది. ఐదు రోజుల వ్యవధిలో 43 శాతం పెరిగినట్లు వెల్లడించింది. చివరిసారిగా గతేడాది అక్టోబర్ లో 2,208 కేసులు నమోదు కాగా.. సుమారుగా 149 రోజుల తర్వాత 1,890 కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,433గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.29 శాతంగా ఉంది. దేశంలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.47 కోట్లు నమోదు కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.02 శాతంగా ఉండగా, రివకరీ రేటు 98.79 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 4,41,63,883 మంది వ్యాధి నుండి కోలుకోగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ద్వారా ప్రభుత్వం 220.65 కోట్ల కోవిడ్‌ వ్యాక్సిన్లు అందించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)