దేశంలో కొత్తగా 1,590 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా గడచిన ఒక్కరోజులోనే 1,590 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, గడచిన 146 రోజుల్లో ఇవే అత్యధికంగా నమోదైన కేసులని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,601కు చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఒక్కొరు చొప్పున కరోనాకు బలయ్యారని ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. మరణాల రేటు 1.19శాతంగా నమోదైంది. ఇక తాజా మరణాలతో కలిపి కరోనా ప్రారంభం నుంచి వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 5,30,824కు చేరింది. పాజిటివిటి రేటు 1.33శాతంగా ఉంది. ఇక ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం రోజువారీ రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు కేంద్రం 220.65 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)