టికెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.100 కోట్లు వసూలు

Telugu Lo Computer
0


టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి సెంట్రల్ రైల్వేస్ ముంబై డివిజన్ రూ. 100 కోట్లను జరిమానాల రూపంలో వసూలు చేసింది. దీంతో భారతీయ రైల్వేల్లో అద్భుతమైన రికార్డ్ సృష్టించిన తొలి డివిజన్ గా ముంబై నిలిచింది. ఏప్రిల్ 2022 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 18 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేేసింది. గతేడాది ఇది రూ. 60 కోట్లుగా ఉంది. టికెట్ లేకుండా ప్రయాణాలు చేయవద్దని సెంట్రల్ రైల్వే ప్రయాణికులను హెచ్చరిస్తోంది. అయితే ఇవన్నీ పట్టకుండా టికెట్ లేకుండా ప్రయాణిస్తుండటంతో పెద్ద ఎత్తున ఫైన్ లను వసూలు చేస్తున్నారు అధికారులు. టికెట్ చెకింగ్ చేయడం ద్వారా ప్రయాణికులకు మరింతగా సౌకర్యవంతంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నామని, రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులు, టికెట్ తీసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు కలుగచేస్తున్నారనే ఫిర్యాదుతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని దీంతో ఈ రికార్డు సాధ్యం అయిందని సెంట్రల్ రైల్వేస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ సుతార్ వెల్లడించారు. మొత్తం ఫైన్లను సబర్భన్ లలో టికెట్ లేని ప్రయాణికలు నుంచి, ఇతర సాధారణ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వాళ్ల నుంచి వసూలు చేశారు. ముంబై డివిజన్ లో 77 రైల్వే స్టేషన్లలో, 1200 మంది టికెట్ ఎగ్జామినర్ల( టీటీఈ)లు ఉన్నారు. వీరంతా టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికులపై నిఘా పెడుతున్నారు. టికెట్ లేకుండా ప్రయాణించే వారి బాడీ లాంగ్వేజ్ ద్వారానే వారిని గుర్తిస్తున్నామని, నిరంతం నిఘా వల్ల వారు ఎలా వ్యవహరిస్తారో తెలుసుకుని, గుర్తిస్తున్నామని టీటీఈలు చెబుతున్నారు. ఎయిర్ కండిషన్డ్ లోకల్ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 25,781 మంది ప్రయాణికుల నుంచి రూ. 87.43 లక్షల జరిమానా, ఫస్ట్ క్లాస్ కోచ్‌లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించిన 1.45 లక్షల మంది ప్రయాణికుల నుంచి రూ. 5.05 కోట్ల జరిమానాతో కలిపి మొత్తంగా రూ. 100 కోట్ల జరిమానా విధించినట్లు సెంట్రల్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 2019-20 లో ముంబై డివిజన్ 15.73 లక్షల మంది నుంచి రూ. 76.82 కోట్లను వసూలు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)