భూటాన్ లో 10 గ్రాములు బంగారం రూ.37,000 !

Telugu Lo Computer
0


భూటాన్ లో బంగారం కొంటే ఎటువంటి పన్ను కట్టనవరం లేదు. ముఖ్యంగా భారతీయులు భూటాన్ లో బంగారం కొంటే పన్ను రహితంగానే బంగారం కొనుక్కునేలా భూటాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారతీయులు భూటాన్ ను సందర్శించానికి ఎక్కువ సంఖ్యలో వెళుతుంటారు. అలా వెళ్లిన వారికి  భూటాన్ ప్రభుత్వం ఎటువంటి పన్ను కట్టకుండానే బంగారం కొనుక్కునే అవకాశం కల్పించింది. పర్యాటక రంగాన్ని పెంచుకోవటానికే ఇటువంటి అనుమతులు ఇచ్చింది. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రుసుము చెల్లించే పర్యాటకులు భూటాన్‌ రాజధాని థింఫు, పుట్‌షోలింగ్ నగరాల నుండి సుంకం లేని బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. చాలామంది భారతీయులు బంగారం కొనటానికి దుబాయ్ వెళుతుంటారు. ఎందుకంటే అక్కడ బంగారం కొనుగోళ్లపై పన్ను తక్కువగా ఉంటుంది. పైగా ధర కూడా తక్కువగా ఉంటుంది. ఫంట్‌షోలింగ్, థింఫు నగరాల్లో ఫిబ్రవరి 21 న భూటాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భూటాన్ కొత్త ఏడాది, భూటాన్ రాజు హిజ్ మెజెస్టి ది కింగ్స్ జన్మదినం పురస్కరించుకుని ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. సాధారణంగా లగ్జరీ వస్తువులను విక్రయించే డ్యూటీ ఫ్రీ అవుట్‌లెట్ల ద్వారా బంగారాన్ని విక్రయిస్తారు. ఇది భూటాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.567,820. అయితే, భూటాన్‌లో అదే మొత్తంలో బంగారం ధర భూటానీస్ న్గుల్ట్రమ్ బీటీఎన్  37,588.59గా ఉంది. భారత రూపాయి దాదాపు ఒక బీటీఎన్ కి సమానం. కరోనా ప్రపంచం మొత్తాన్ని ఎక్కడిక్కడ నిలిపివేసింది. ఆర్థికంగా దెబ్బతీసింది. ముఖ్యంగా పర్యటక రంగం పూర్తిగా నిలిచిపోయింది. ఈక్రమంలో భూటాన్ మళ్లీ పర్యాటకుల కోసం తలుపులు తెరిచాక భూటాన్ జాతీయ అసెంబ్లీ కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం పర్యాటకులు పర్యాటక పన్ను చెల్లించడం తప్పనిసరి చేశారు. దీనిని సుస్థిర అభివృద్ధి రుసుము అని పిలుస్తారు. దీని కారణంగా ప్రతి భారతీయుడు రోజుకు రూ. 1,200 చెల్లించాలి. ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకులు 65 నుండి 200 డాలర్ల వరకు చెల్లించాలి. చాలా మంది భారతీయులు భూటాన్‌కు వెళుతున్నందున కొత్త పథకం నుండి భారతీయులు ఎక్కువ ప్రయోజనం పొందాలంటే భూటాన్ పర్యాటక శాఖ ధృవీకరించిన హోటల్‌లో కనీసం ఒక రాత్రి గడిపినంత కాలం సుస్థిర అభివృద్ధి రుసుము చెల్లించే పర్యాటకులందరూ డ్యూటీ-ఫ్రీ బంగారాన్ని కొనుగోలు చేయడానికి అర్హులు. మార్చి 1 నుంచి భూటాన్‌లోని ఫంట్‌షోలింగ్, థింఫు నగరాల్లో బంగారం కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు భూటాన్ అధికారిక పత్రిక డైలీ కౌన్సెల్ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)