ఇండియన్ సినిమా గర్వించదగిన క్షణం !

Telugu Lo Computer
0


రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్  చిత్రంతో ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు. హాలీవుడ్ ఆడియన్స్ నుంచి మూవీ టెక్నీషియన్స్ వరకు చరణ్ నటనకి ఫిదా అయిపోతున్నారు. దీంతో అమెరికన్ మీడియా రామ్ చరణ్ పై అనేక ఆర్టికల్స్ రాసుకొస్తున్నారు. తాజాగా యూఎస్ లో అత్యధికలు వీక్షించే పాపులర్ టాక్ షో 'గుడ్ మార్నింగ్ అమెరికా' కు రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్ళాడు. ఇండియన్ నుంచి ఈ షోకి ఆహ్వానం అందుకున్న మొదటి సెలెబ్రెటీ రామ్ చరణ్. దీంతో చరణ్ అభిమానులతో పాటు కుటుంబసభ్యులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఉపాసన చిన్నమ్మ సంగీతారెడ్డి.. 'నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అల్లుడు' అంటూ ట్వీట్ చేసింది. తాజాగా చిరంజీవి కూడా తన పుత్రోత్సాహాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇండియా తరుపు నుంచి రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోకు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమా గర్వించదగిన క్షణం ఇది. ఇటువంటి అవకాశాన్ని తీసుకువచ్చిన మాస్టర్ మైండ్ రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)