మేకప్​ మ్యాన్ మీద చిరుత దాడి

Telugu Lo Computer
0


'చోటే మియా బడే మియా' చిత్ర మేకప్ మ్యాన్​ శ్రవణ్ విశ్వకర్మపై చిరుతపులి దాడి చేసింది. 27 సంవత్సరాల శ్రవణ్ విశ్వకర్మ ముంబై ఫిల్మ్​ సిటీలో ఫ్రెండ్​ను షూటింగ్ స్పాట్ నుంచి డ్రాప్ చేసేందుకు వెళ్లాడు. అప్పుడు బైక్ మీద చిరుత పులి దాడి చేసింది. ప్రస్తుతం శ్రవణ్​కు ప్రొడక్షన్ హౌసే ట్రీట్​మెంట్ అందిస్తున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమా సెట్ నుండి హృదయ విదారకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సినిమాలో వర్క్ చేస్తున్న మేకప్ ఆర్టిస్ట్‌పై చిరుతపులి దాడి చేసి గాయపరిచింది. చిరుతపులి దాడిలో గాయపడిన మేకప్ ఆర్టిస్ట్ ఆస్పత్రిలో చేరారు. ఒక న్యూస్ పోర్టల్‌లోని కథనం ప్రకారం.. మేకప్ ఆర్టిస్ట్ శ్రవణ్ విశ్వకర్మ తన బైక్‌పై ఉన్నాడు. షూట్ నుండి తన స్నేహితుడిని డ్రాప్ చేయడానికి వెళ్లాడు. అతని బైక్ పై దారిలో చిరుతపులి దాడి చేసింది. గాయపడిన మేకప్ ఆర్టిస్ట్ చికిత్స ఖర్చులను ప్రొడక్షన్ హౌస్ వారే భరిస్తున్నట్లు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)