రూపా మౌడ్గిల్ కు రోహిణి సింధూరి లీగల్ నోటీసులు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 22 February 2023

రూపా మౌడ్గిల్ కు రోహిణి సింధూరి లీగల్ నోటీసులు !


కర్ణాటక ప్రభుత్వం, సీఎస్ హెచ్చరికలను పట్టించుకోకుండా బుధవారం రూపా మరోసారి ఫేస్ బుక్ వేదికగా ఓ పోస్టును పెట్టారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోరాడుతున్నా అని అన్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తనపై విమర్శలు చేసిన ఐపీఎస్ రూపా మౌడ్గిల్ కు రోహిణి సింధూరి లీగల్ నోటీసులు పంపించారు. తనను మానసిక క్షోభకు గురిచేసి, పరువు పోయేలా విమర్శలు చేసిన రూపా తనకు రాతపూర్వకంగా క్షమాపణలతో పాటు రూ. 1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూపా చేసిన వ్యాఖ్యలు తన క్లయింట్, ఆమె కుటుంబ సభ్యులను మానసిక వేదనకు గురి చేశాయని, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, సామాజిక జీవితంలో రూపా ప్రవర్తన మూలంగా తన క్లయింట్ అయిన రోహిణి నిద్రలేని రాత్రులను గడుపుతున్నారని, ఈ అంశం బ్యూరోక్రాట్ సర్కిళ్లలో చర్చనీయాంశం అయిందని నోటీసుల్లో పేర్కొన్నారు. రూపా, రోహిణి సింధూరి గురించి ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో వివాదం మొదలైంది. రోహిణి సివల్ సర్వీస్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని, పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ విమర్శించింది. దీనిపై స్పందించిన రోహిణి, ఆమె మానసిక స్థితి బాగా లేదని అన్నారు. ఇదిలా ఉంటే బుధవారం రూపా మరో పోస్టు పెట్టారు. దయచేసి రోహిణి సింధూరి ఐఎఎస్‌పై నేను లేవనెత్తిన అవినీతి సమస్యపై దృష్టి పెట్టండి.. అతి సామాన్యులను ప్రభావితం చేసే అవినీతికి వ్యతిరేకంగా పోరాడకుండా నేను ఎవరినీ నిరోధించలేదని అన్నారు. నేను, నా భర్త ఇంకా కలిసి ఉన్నామని, కుటుంబాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి మేము ఇంకా పోరాడుతున్నామని పేస్ బుక్ పోస్టులో రూపా రాసుకొచ్చారు. 

No comments:

Post a Comment