చైనాలో భారీ భూకంపం

Telugu Lo Computer
0


చైనాలోని జింజియాంగ్ వీఘర్ అటానమస్ రీజియన్‌  గురువారం తీవ్ర భూకంపం సంభవించింది.  చైనా స్టేట్ మీడియా కథనం ప్రకారం గురువారం 7.3 తీవ్రతతో భూమి కంపించింది. అయితే అమెరికన్ జియొలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.8 అని తెలుస్తోంది. ఇది తజకిస్ఠాన్ సరిహద్దుల్లోని ముర్ఘబ్‌కు పశ్చిమ దిశలో 67 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. భూమి లోపల 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. పామిర్ కొండ ప్రాంతంలో సుమారు కొన్ని వందల మంది నివసించే ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. దీని కేంద్రం భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)