వాలెంటైన్స్ డే గిఫ్ట్ పేరిట టోకరా !

Telugu Lo Computer
0


ముంబైకి చెందిన 51 ఏళ్ల మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో అలెక్స్ లోరెంజో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయమైన కొద్ది రోజులకే ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. అలెక్స్ వాలెంటైన్స్ డే గిఫ్ట్ పంపిస్తున్నా, పార్సిల్ చేశానని ఆ మహిళను నమ్మించాడు. తర్వాత ఓ వ్యక్తి పార్సిల్ పర్మిట్ నుంచి ఫోన్ చేస్తున్నానంటూ 'కొరియర్‌లో యూరోపియన్ కరెన్సీ ఉంది, వీటివల్ల మీపై మనీలాండరింగ్ కేసు పడతుంది. కేసు బయటికి రాకుండా ఉండాలంటే కొంత డబ్బు పంపాలని' చెప్పాడు. అది విన్న మహిళ భయపడి మొదట రూ.72,000, తర్వాత రూ.2,65,000 పంపించింది. ఇలా మొత్తం తన దగ్గరనుంచి రూ.3.68 కొట్టేశారు. మళ్లీ కొంతమంది ఫోన్ చేసి పార్సిల్ మీ వరకు రావాలంటే రూ.92,000 పంపాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ డబ్బు అడగడంతో అనుమానపడిన మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు అలెక్స్‌తో పాటు మరో ఇద్దరిని పట్టుకున్నారు. వారిపై 420 కేసుతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)