మద్యం అలవాటు ఉన్న గర్భిణులకు పుట్టే పిల్లల ముఖాకృతిలో వైరుధ్యాలు ?

Telugu Lo Computer
0


విదేశాల్లో అందరూ మద్యపానం సేవించడం సర్వసాధారణం. మద్యపానం అలవాటు వున్న మహిళలు గర్భధారుణులైతే వారికి కలిగే పిల్లలపై  నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు  పరిశోధన చేశారు.  అలాంటి మహిళలకు పుట్టే శిశువుల ముఖాకృతుల్లో వైరుధ్యాలు రావొచ్చని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. కృత్రిమ మేధ, డీప్‌ లెర్నింగ్‌ పరిజ్ఞానాల సాయంతో వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ''ఇది చాలా ముఖ్యమైన పరిశీలన. ఎందుకంటే చిన్నారుల ముఖం,  వారి ఆరోగ్యం, ఎదుగుదల సమస్యలకు దర్పణం పడుతుంది'' అని ఈ పరిశోధనలో పాల్గొన్న గెన్నాడీ రోషచుప్కిన్‌ వివరించారు. గర్భం ధరించినప్పుడు, అంతకుముందు మద్యం అతిగా సేవించడం వల్ల ఒక మహిళ గర్భంలోని పిండానికి ఫీటల్‌ ఆల్కాహాల్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ (ఎఫ్‌ఏఎస్‌డీ) తలెత్తవచ్చని పేర్కొన్నారు. అది శిశువు ముఖంలో ప్రతిబింబించ వచ్చని తెలిపారు. ఎఫ్‌ఏఎస్‌డీ ఉన్న చిన్నారుల్లో ఎదుగుదల తగ్గడం, నాడీ సంబంధ సమస్యల వంటివి రావొచ్చునని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)