పుతిన్‌ ను సన్నిహితులే చంపేస్తారు : జెలెన్‌ స్కీ

Telugu Lo Computer
0


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను ఏదో ఒక రోజు ఆయన సన్నిహిత సహచరులే చంపేస్తారని ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌ స్కీ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇయర్‌ అనే ఉక్రెయిన్‌ డాక్యుమెంటరీ విడుదల సందర్భంగా జెలెన్‌ స్కీ చేసినట్లు అమెరికాకు చెందిన న్యూస్‌ వీక్‌ వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేసి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ డాక్యుమెంటరీని గత శుక్రవారం నాడు విడుదల చేశారు. రష్యాలో పుతిన్‌ నాయకత్వం కూడా బలహీన పడుతోందన్నారు జెలెన్‌ స్కీ. దీంతో ఆయన సన్నిహిత సహచరులే ఏదో ఒక రోజు ఆయనను చంపేస్తారని జెలెన్‌ స్కీ అన్నారు. పుతిన్‌ ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉందని, ఏదో ఒక రోజు కుప్ప కూలుతుందన్నారు. రష్యా నుంచి కూడా తమకు వార్తలు అందుతున్నాయన్నారు జెలెన్‌ స్కీ. పుతిన్‌ సన్నిహితులు కూడా పుతిన్‌పై ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇటీవల వాషింగ్టన్‌ పోస్టు కూడా పుతిన్‌ సన్నిహితులు కూడా నిరాశతో ఉన్నారని పేర్కొంది. ఎందుకంటే యుద్ధ రంగంలో సైనికులు తమ వేదనను వెళ్ల గక్కుతూ కన్నీరు పెడుతున్న వీడియోలు వెలుగుచూస్తున్నాయి. దీంతో పుతిన్ సన్నిహితుల ఆగ్రహానికి ఇది కూడా కారణమని చెబుతున్నారు. క్రిమియా ద్వీపకల్పం ఉక్రెయిన్‌ చేతికి వచ్చాకనే యుద్ధం ముగుస్తుందన్నారు జెలెన్‌ స్కీ. ఇది మా భూమి. వారు మా ప్రజలు మా చరిత్ర.ఉక్రెయిన్‌లోని మారుమూల ప్రాంతంలో ఉక్రెయిన్‌ జెండా రెపరెపలాడాల్సిందేనని జెలెన్‌ స్కీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)