మసీదు దగ్గర ఉగ్రవాదుల కాల్పులు

Telugu Lo Computer
0

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఓ మసీదు బయట ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రజలకు సురక్షిత ప్రదేశాలకు పంపిన అనంతరం జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి ఆ ప్రాంతమంతా కార్డెన్ సెర్చ్, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఘటనలో ఒకరికి గాయమైందని, అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించామని తెలిపారు. శుక్రవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంత్‌నాగ్‌లోని బిజ్‌బెహరాలోని హసన్‌పోరా తవేలా ప్రాంతంలోని మసీదు వెలుపల ఉగ్రవాదులు కాల్పులు జరిపారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. ఇందులో ఒక వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన ఆసిఫ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)