అమెరికా బిలియనీర్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 25 February 2023

అమెరికా బిలియనీర్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య


అమెరికాలో బిలియనీరు థామస్ లీ మన్‌హట్టన్‌లోని తన కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. 78 సంవత్సరాల థామస్ లీ ప్రైవేటు ఈక్విటీ , క్రయవిక్రయాల వ్యాపారాలలో దిగ్గజంగా పేరొందారు. అమెరికా సమయం ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు ఫిఫ్త్ ఎవెన్యూ మన్‌హట్టన్ ఆఫీసులోనే ఆయన బలవన్మరణం చెందడం సంచలనం అయింది. ఇది ఆయన ఇన్వెస్ట్‌మెంట్‌ల కంపెనీ ప్రధాన కార్యాలయంగా ఉంది. తనకు తాను రివాల్వర్ తీసుకుని కాల్చుకున్నందున బాత్రూంలో తీవ్ర రక్తస్రావం దశలో పడి ఉండగా ఆయన ఆఫీసు సహాయకురాలు గుర్తించింది. ఎమర్జెన్సీ 911కు కాల్ చేయగా, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వైద్య పరీక్షల తరువాత ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. ఆఫీసుకు వచ్చిన ఉదయం నుంచి ఆయన కన్పించకుండా ఉండటంతో అసిస్టెంట్‌కు అనుమానం వచ్చి చూడగా తలకు గాయాలై ఆయన పడి ఉండటం కన్పించింది. వ్యాపార కార్యకలాపాలు, వైవాహిక జీవితపరంగా కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్న ఆయన వితరణశీలిగా కూడా పేరొందారు. గత 46 సంవత్సరాలలో ఆయన వందలాది డీల్స్ ద్వారా 15 బిలియన్ డాలర్లకు పైగా లావాదేవీల ఘనత వహించారు. ఆయన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితి మిస్టరీగా నిలిచింది.

No comments:

Post a Comment