బంగారు ఆభరణాలతో పరారైన డ్రైవర్ అరెస్టు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరుకు చెందిన వెలిషెట్టి శ్రీనివాస్ పోసి ఎస్‌ఆర్ నగర్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని రాధిక డైమండ్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17వ తేదీన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అక్షయ్ కుమార్‌తో కలిసి కారులో నగలను డెలివరీ చేసేందుకు మధురానగర్‌కు వచ్చాడు. అక్షయ్ కారులో బంగారు ఆభరణాలు, వజ్రాలను పెట్టి కస్టమర్ ఇంట్లోకి వెళ్లాడు.వారికి బంగారు ఆభరణాలు ఇచ్చి బయటికి వచ్చే సరికి శ్రీనివాస్ కన్పించలేదు. వెంటనే అక్కడికి సమీపంలో ఉన్న అభినాస్‌ను సంప్రదించగా శ్రీనివాస్ బంగారు ఆభరణాలతో పారిపోయేందుకు యత్నిస్తుండగా ఆపేందుకు ప్రయత్నం చేశానని, తనను చంపివేస్తానని కత్తితో బెదిరించాడని చెప్పాడు. శ్రీనివాస్ రూ.7కోట్ల బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోవడంతో వెంటనే ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొట్టేసిన సొత్తుతో కారులో బాలానగర్ వరకు పోయి అక్కడ కారును వదిలేసి వరంగల్, నర్సంపేటకు వెళ్లి అక్కడ నుంచి కొవ్వూరుకు వెళ్లాడు. నిందితుడి కోసం ఆరు టీములను ఏర్పాటు చేసిన పోలీసులు సొంత గ్రామంలో పట్టుకున్నారు. విలాసవంతంగా జీవించాలనే కోరికతో దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల తర్వాత వచ్చి హైదరాబాద్‌లో బంగారు ఆభరణాలను డిస్పోజ్ చేయాలని ప్లాన్ వేశాడని తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్ సైదులు, డిఐ పివి రామ్‌ప్రసాద్, ఎస్సై ఎండి సర్దార్ తదితరులు పట్టుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)