హైదరాబాద్ లో వీధి కుక్కల బీభత్సం !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ హైదర్ గూడ ఎర్రబోడ కాలనీలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. వరుసగా ఐదుగురిపై దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కరిచిన పిచ్చి కుక్క, చేయి పట్టుకొని ఈడ్చుకుంటు వెళ్లింది. కింద పడేసి నెత్తిపై విచక్షణారహితంగా కరిచి గాయ పరిచింది. అడ్డుకోవడానికి యత్నించిన మరో బాలుడి పై కూడా కుక్క దాడి చేసింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైనారు. వీధి కుక్కల నుండి మమ్మల్ని కాపాడాలని అధికారులను కాలనీ వాసులు వేడుకుంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)