రాకేశ్‌, సుజాత వివాహం

Telugu Lo Computer
0


జబర్దస్థ్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌  జోర్దార్‌ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట నిశ్చితార్థం ఇటీవలె జరగ్గా, తాజాగా వీరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. బుల్లితెరపై పలు షోలతో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ రియల్‌ కపుల్‌ అనిపించుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పలువురు బుల్లితెర నటీనటులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన సుజాత తెలంగాణ  యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. బిగ్‌బాస్‌ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక జబర్దస్థ్‌ షోతో గుర్తింపు పొందిన రాకేశ్‌తో కలిసి పలు షోల్లో జంటగా పాల్గొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)