ఇంగ్లీష్‌లో మాట్లాడిన అధికారిపై నితీష్ కుమార్ ఆగ్రహం

Telugu Lo Computer
0


బీహార్ రాజధాని పాట్నాలో కిసాన్ సమాగం పేరుతో మంగళవారం ఒక కార్యక్రమం జరిగింది. దీనికి సీఎం నితీష్ కుమార్‌తోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఇది రైతు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారుల్లో ఒకరు ఇంగ్లీష్‌లో మాట్లాడారు. దీనిపై నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాతృభాషలో మాట్లాడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ''మనకేమైంది. కోవిడ్ సమయంలో ప్రజలు స్క్రీన్లకు అతుక్కుపోయారు. మెల్లిగా సొంత భాషను కూడా మర్చిపోయారు. ఇది సరికాదు. మన రాష్ట్రంలో మాట్లాడే భాషనే ఉపయోగించాలి. ప్రజలు మాతృ భాషను, మూలాల్ని మర్చిపోతున్నారు. అధికారులు సొంత భాషలోనే మాట్లాడాలి. ఇంగ్లీష్‌ను చదువు కోసమే ఉపయోగించాలి. అధికారులు ఇంగ్లీష్‌లో మాట్లాడటం ఏంటి? ఇదేమైనా ఇంగ్లండా? మీరు బిహార్‌లో పని చేస్తున్నారని గుర్తించాలి'' అని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఇంగ్లీష్‌లో మాట్లాడిన అధికారి ముఖ్యమంత్రిని క్షమాపణలు కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళవారం మాతృభాషా దినోత్సవం అనే సంగతి తెలిసిందే. ఇదే రోజున బిహార్ సీఎం మాతృభాషపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)