కిషన్ రెడ్డి మేనల్లుడు గుండెపోటుతో మృతి

Telugu Lo Computer
0


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు వెంటనే కాంచన్ బాగ్ లో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనను టెస్ట్ చేసిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి నోయిడాలో ఉన్నారు. ఈ వార్త తెలియగానే  హైదరాబాద్ కు  బయలుదేరినట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి అక్కాబావ కుటుంబం సైదాబాద్ వినయ్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. జీవన్ రెడ్డి అంత్యక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వార్త తెలియగానే పలువురు బీజేపీ  నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)