ఫోన్‌పే, గూగుల్ పేల్లో లోన్ సౌకర్యం !

Telugu Lo Computer
0


ఫోన్‌పే, గూగుల్ పే వంటివి తమ యూజర్లకు లోన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంచాయి. గూగుల్ పే, ఫోన్‌పే  నేరుగా రుణాలు ఇవ్వవు. ఇశి ఇతర సంస్థలతో భాగస్వామ్యం ద్వారా రుణ సదుపాయం అందిస్తాయి. అంటే ఫోన్‌పే మనీ వ్యూ, బడ్డీ లోన్ వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఫోన్‌పే తన ప్లాట్‌పామ్ ద్వారా ఈ ఫిన్‌టెక్ సంస్థలను ప్రమోట్ చేస్తోంది. లోన్ కావాలంటే ముందుగా ఫోన్‌పే యాప్‌లోకి వెళ్లాలి. అక్కడ మీకు పైన బ్యానర్‌లో మనీ వ్యూ లేదంటే బడ్డీ లోన్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవాలి. దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు బడ్డీ లోన్ లేదంటే మనీ వ్యూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. రిజిస్టర్ చేసుకోవాలి. మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, పాన్ కార్డు నెంబర్, జాబ్ వివరాలు, రెసిడెన్షియల్ వివరాలు వంటివి అన్నీ అందించాలి. వివరాలు అన్ని అందించిన తర్వాత మీకు లోన్ అర్హత ఉందా? లేదా? అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ లోన్ ఎలిజిబిలిటీ లేకపోతే మీకు రుణం రాదు. లోన్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సులభంగానే రూ. 5 లక్షల వరకు రుణం పొందొచ్చు. గూగుల్ పే ఫ్రిఫర్ లోన్స్‌తో భాగస్వామ్యం ద్వారా కస్టమర్లకు రుణ సౌకర్యం అందిస్తోంది. రూ.10 వేల నుంచి రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఎక్కడికీ వెళ్లకుండానే ఇంట్లో నుంచే లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. లోన్ తీసుకోవాలని భావించే వారు గూగుల్ పే యాప్‌లోకి వెళ్లాలి. అక్కడ బిబిజెస్‌లు అని ఉంటుంది. దీని పక్కనే ఎక్స్‌ప్లోర్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఫ్రిపర్ లోన్స్ ఆనే ఆప్షన్ ఎంచుకోవాలి.కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కిందకు వస్తే అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు అవసరమైన సమచారం అందించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, ఎంప్లాయ్‌మెంట్ డీటైల్స్ వంటి తదితర వివరాలు ఇవ్వాలి. లోన్ అర్హత ఉందా? లేదా? అనే విషయం వెంటనే తెలిసిపోతుంది. అర్హత కలిగిన వారు లోన్ పొందొచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)