భూమి లేని గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు నెలకు రూ.2500 పెన్షన్ మంజూరు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  అమరావతిలో భూమి లేని గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నెలకు రూ.2,500 పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. మార్చి ఒకటో తేదీ నుండి ఈ పెన్షన్ పధకం అమరావతి గ్రామ వాలంటీర్లకు వర్తిస్తుందని శ్రీలక్మి తెలిపారు. అమరావతి లో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన యువతీ యువకులైన గ్రామ వాలంటర్లుగా పని చేస్తున్నారు. వీరిని ఉద్యోగులు గా పరిగణించి ప్రతి నెలా భూమి లేని నిరుపేద కుటుంబాలకు పింఛను రూ.2,500 మంజూరు చేస్తున్నారు. ఇటీవల పురపాలక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అమరావతి గ్రామాలలో పర్యటనలో ఉన్న సమయంలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వాలంటీర్లు విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి ఈ విషయం తెచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన శ్రీలక్ష్మి ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని అమరావతి వాలంటీర్ల కు హామీ ఇచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్ వారికి పెన్షన్లు అందించాలని ఆదేశించారు.అమరావతిలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన సుమారు 200 మంది గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు మార్చి1వ తేదీ నుండి పెన్షన్ అందిస్తున్నామని మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి స్పష్టం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)