వరుడుకి షాక్‌ ఇచ్చిన వధువు !

Telugu Lo Computer
0


పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో వరుడికి నవవధువు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. దాంతో పాపం కొత్త పెళ్లికొడుకు బిక్కముఖం వేసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా చూస్తే పరువు పోతుందని భావించి సైలెంట్‌గా చూస్తుండిపోయాడు. ఇంతకీ వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఏముందంటే.. పెళ్లి తంతు ముగిసిందని తెలుస్తోంది. వధూవరులు, బంధుమిత్రుల సమక్షంలో సహాపంక్తి భోజనాలు చేస్తున్నారు. అమ్మాయి, అబ్బాయికి భోజనం వడ్డించారు. వధూవరులు భోజనాల కోసం టేబుల్ వద్ద కూర్చున్నారు. కెమెరామెన్‌ ఫోటోలు, వీడియోలు తీసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతలోనే వధువు ఒక స్వీట్‌ తీసి వరుడు నోటికి అందిస్తుంది. అతడు ఆ పదార్థాన్ని ఆఫ్‌ బైట్‌ మాత్రమే తినేశాడు. సంగం మిగిలిపోయింది.. దాంతో విసుగెత్తిపోయిన నవ వధువు.. ఆ మిగిలిపోయిన పదార్థాన్ని అతడి పళ్లెంలోనే వేసింది. ఈ అందమైన క్షణాన్ని తీయడానికి ఫోటోగ్రాఫర్‌లు ఎదురుచూస్తున్నారు. వరుడు చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. కానీ ఆ తర్వాత జరిగిన సీన్‌తో పాపం పెళ్లి కొడుకు బిత్తరపోయాడు. వధువు చేసిన ఈ పనికి వరుడు షాక్ అయ్యాడు. మాటల్లో చెప్పలేని బాధతో కెమెరామెన్ వైపు చూశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)