పొంచి ఉన్న భారీ భూకంపం

Telugu Lo Computer
0


ఉత్తర కాశీలో భూమి బీటలు వారిన కారణంగా భారత్ లోని భూకంప శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు. భారత ప్లేట్ జారడం వల్ల హిమాలయ ప్రాంతంలో భూకంపాలు వచ్చే ప్రమాదం పెరుగుతోందని హైదరాబాద్‌కు చెందిన ఎన్‌జీఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త తెలిపారు. భారత టెక్టోనిక్ ప్లేట్ సంవత్సరానికి 5 సెంటీమీటర్ల చొప్పున కదులుతున్నట్లు ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు. దీని వల్ల రానున్న రోజుల్లో భూ ప్రకంపనలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్‌లోని జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ)లోని భూకంప శాస్త్రవేత్త, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. భూమి బయటి భాగం వివిధ ప్లేట్‌లతో నిర్మితమైందని, అవి నిరంతరం కదులుతూనే ఉన్నాయని చెప్పారు. భారతీయ పలక ప్రతి సంవత్సరం 5 సెం.మీ కదులుతుందన్నారు. దీంతో హిమాలయాల్లో ఉద్రిక్తత పెరిగి భూప్రకంపనల ప్రమాదం పెరుగుతోందని వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో మనకు 18 సీస్మోగ్రాఫ్ స్టేషన్ల బలమైన నెట్‌వర్క్ ఉందని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్‌తో సహా, ఈ ప్రాంతాన్ని హిమాచల్, నేపాల్ యొక్క పశ్చిమ భాగానికి మధ్య భూకంప గ్యాప్ అని పిలుస్తారు. ఈ ప్రాంతం భూకంపాల పరంగా చాలా సున్నితంగా ఉంటుంది. ఎప్పుడైనా ఇక్కడ భూకంపం సంభవించవచ్చే అవకాశం ఉందని తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 20 న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు ఉత్తరాన 56 కి.మీ దూరంలో 3.6 తీవ్రతతో భూకంపం నమోదైంది. రానున్న రోజుల్లో భారత్ లో భారీ భూకంపం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. గత కొన్నిరోజులుగా హిమాలయాలు, ఢిల్లీతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా నిత్యం ఏదొక చోట భూమి కంపిస్తూనే ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)