పంజాబ్‌లో కేంద్రం జోక్యం చేసుకోవాలి !

Telugu Lo Computer
0


పంజాబ్‌లో శాంతి భద్రతల వైఫల్యంపై అమరీందర్ సింగ్ ప్రశ్నించారు. పంజాబ్ ప్రభుత్వం, సీఎం భగవంత్ మన్‌పై విమర్శలు గుప్పించారు. ''పంజాబ్‌లో ఏం జరుగుతోంది అనే దానిపై సీఎం భగవంత్ మన్‌కు ఆసక్తి లేదు. ఏం చర్య తీసుకోవాలన్నా ఆయన భయపడుతున్నారు. ఎలాంటి చర్యా తీసుకోవద్దని పోలీసులకూ ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. ఇలాంటి ప్రభుత్వం ఎక్కువ కాలం నడవలేదు. అజ్నాలా ఘటన జరిగిన రోజు భగవంత్ మన్ ముంబైలో అరవింద్ కేజ్రీవాల్‌తో ఉన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన సమస్య. ఇది కేంద్రానికి సంబంధించిన అంశం కాదు. ఒకవేళ పంజాబ్ ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎదుర్కోలేకుంటే కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకోవాలి. పంజాబ్‌లోకి పాకిస్తాన్ నుంచి డ్రోన్లు దూసుకొస్తున్నాయి. దీనిపై కేంద్రం దృష్టిపెట్టాలి. శాంతి భద్రతల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి'' అని అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)