మళ్లీ పెరగనున్న మెుబైల్ టారిఫ్స్ ?

Telugu Lo Computer
0


ప్రస్తుతం ఉన్న కంపెనీలు కస్టమర్లను నిలుపుకునేందుకు చాలా కష్టపడుతున్నాయి. పైగా మెరుగైన సేవల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మెుబైల్ వరల్డ్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న భారతీ ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ దేశంలోని టెలికాం పరిశ్రమపై కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశంలోని టెలికాం వ్యాపారంలో పెట్టుబడిపై రాబడి చాలా తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో 2023 మధ్యలో టారిఫ్ పెంపులు ఉండే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఎయిర్‌టెల్ ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్‌ని కలిగి ఉందని సునీల్ భారతి మిట్టల్ వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన మేరకు మూలధనం ఇంజెక్ట్ చేయబడిందని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుత తరుణంలో భారత టెలికాం వ్యాపారంలో చిన్న పెంపులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. జీతాలు, అద్దెలు, ఇతర ఖర్చులు పెరుగుతున్న తరుణంలో ఛార్జీల పెంపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనవరిలో ఎయిర్‌టెల్ తన 28 రోజుల కనీస రీఛార్జ్ ప్లాన్‌ను 57 శాతం పెంచి రూ. 155కి ఎనిమిది సర్కిళ్లలో ధరను పెంచింది. ఇది 200 MB డేటా, కాల్‌లను సెకనుకు రూ. 2.5 పైసలకు అందించే రూ.99 కనీస ప్లాన్‌ను కూడా రద్దు చేసింది. దేశంలోని మరో టెలికాం సంస్థ వొడాఫోన్ సైతం ఆదాయాన్ని పెంచుకునేందుకు టారిఫ్ లను పెంచాలని డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)