భావసారూప్యత ఉన్నపార్టీలతో కలిసి పోటీ చేస్తాం : మల్లికార్జున ఖర్గే

Telugu Lo Computer
0


ఛత్తీస్ ఘడ్ రాజధాని రాయ్‭ పుర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ  భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా భావసారూప్యత ఉన్నపార్టీలతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో రాజ్యాంగంపైనా, ప్రజాస్వామిక విలువలపైనా నిత్యం దాడి జరుగుతోందని, దేశ సరిహద్దుల్లో చైనా నుంచి ముప్పు పొంచి ఉందని, దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగ,రైతు సమస్యలు పెరుగుతున్నాయని, ఇంతటి కఠినమైన స్థితిలోకి దేశాన్ని నెట్టింది మోదీ ప్రభుత్వమేనని అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సమర్థమైన నాయకత్వాన్ని అందించగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని ఖర్గే అన్నారు. 2004 నుంచి 2014 వరకు భావసారుప్యం కలిగిన పార్టీతో కలిసి దేశానికి ఏవిధంగా సేవ చేశామో, అదే తరహాలో మరోసారి అలాంటి పార్టీలతో కలిసి ప్రజావ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఖర్గే అన్నారు. ఢిల్లీలో ఉన్నది పేదల వ్యతిరేక ప్రభుత్వమని, అది ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉందని విమర్శించారు. మోదీ ప్రజలకు ప్రధాన సేవక్ కాదని, కేవలం తన స్నేహితుల ప్రయోజనం కోసం పని చేసే ప్రధాన సేవక్ అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు బిజెపి కుట్ర చేస్తుంటే, దేశాన్ని ఏకం చేసేందకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఖర్గే అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)