ఉమేష్ పాల్ హత్య కేసులో బీజేపీ నేత సోదరుడిపై అభియోగాలు నమోదు

Telugu Lo Computer
0


2005లో బీఎస్‌పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ హత్యోదంతంలో ఉత్తర ప్రదేశ్ బీజేపీ నేత రహిల్ అసన్ సోదరుడు గులాంపై అభియోగాలు నమోదయ్యాయి. హత్యారోపణలు ఎదుర్కొంటున్న గులాంను పార్టీ నుంచి తొలగించినట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గణేష్ కేశర్వాణి వెల్లడించారు. శుక్రవారం ఉమేష్ పాల్ నివాసం వద్ద ఆయనపై ఏడుగురు దుండగులు బుల్లెట్లు, క్రూడ్ బాంబులతో దాడి చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి స్వరూప్‌రాణి నెహ్రూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో దుండగుల్లో ఒకరు కూడా మరణించారు. పాల్ శరీరంలోకి ఏడు బుల్లెట్లు చొచ్చుకుపోగా ఆయన శరీరంపై 13 చోట్ల గాయాల మరకలున్నాయని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. అన్ని బుల్లెట్లు పిస్టల్ నుంచి దుండగులు కాల్చారని తేలింది. ఉమేష్ 2005లో బీఎస్‌పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి కావడం గమనార్హం. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజకీయ నేతగా అవతరించిన మాఫియా డాన్ అతిక్ అహ్మద్ ప్రస్తుతం గుజరాత్ జైలులో ఉన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)