'నాటు నాటు' పాటకు టీం ఎఫర్ట్స్ ఎక్కువగా ఉందంటూ మోడీ కామెంట్ !

Telugu Lo Computer
0


 ఒక వీడియోలో కొరియన్స్ నాటు నాటు పాటకు అందంగా డాన్స్ చేశారు. ఆ వీడియోను కొరియా ఎంబసీ ఇండియా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోను ప్రధాని మోడీ రీట్వీట్ చేస్తూ ఇది చూసేందుకు ఎంతో బాగుందని, టీం ఎఫర్ట్స్ ఎక్కువగా ఉందంటూ కామెంట్ చేశారు. ఈ పాటను ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. గత ఐదు రోజులుగా అమెరికా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆర్ఆర్ఆర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. అలాగే.. కాలిఫోర్నియా వేదికగా జరిగిన హెచ్ సీఏ అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)