అదానీకి ప్రజల సొమ్ము దోచిపెట్టారు !

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ వేదికగా మూడురోజల పాటు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో చివరిరోజైన ఆదివారంనాడు ఖర్గే ప్రసంగిస్తూ, దేశ సంపదను కొద్ది మంది వ్యక్తులు దోచుకుంటున్నారని, ప్రజల సొమ్ములు, ఆస్తులును ఒకే వ్యక్తికి మోదీ కట్టబెట్టారని అన్నారు. బలిసిన ఏనుగు తరహాలో అదానీని చాలా పెద్దవాడ్ని చేశారని అన్నారు. పొరుగుదేశమైన చైనాతో సరిహద్దుల్లో సంబంధాలు క్షీణించినా ఆ దేశానికి కేంద్ర క్లిన్ చిట్ ఇస్తోందన్నారు. కేంద్రం తప్పదాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వ వైఖరిని ఎండకట్టాలన్నారు. దేశ రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి కార్యకర్త అంతిమ శ్వాస వరకూ పోరాటం సాగించాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన ప్రసంగం పార్టీ కార్యకర్తల్లో స్ఫూర్తిని, నూతనోత్తేజాన్ని కలిగించిందని ఆయన ప్రశంసించారు. ''మనం చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. సీడబ్ల్యూసీ సీట్లలో 50 శాతం మహిళలు, ఎస్సీలు, ఎస్టీలకు, యువతకు కేటాయించాలని నిర్ణయించాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశభక్తి, త్యాగం, సేవ, అంకితభావం, నిర్భీతి, క్రమశిక్షణకు మారుపేరని ఖర్గే అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై పోరాటాన్ని పార్టీ మరింత తీవ్రం చేస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. కుల ఆధారిత జనగణన తప్పని సరి అని ఆయన చెప్పారు. జాతీయ విద్యా విధానం అనేది కేవలం ఆర్ఎస్ఎస్ విధానమని, దానికి కాంగ్రెస్ వ్యతిరేకమని చెప్పారు. మనుస్మృతి తరహా విద్యను అందించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)