విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 21 February 2023

విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం


కర్ణాటకలో ఏప్రిల్ 1 నుంచి పాఠశాల విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు. కొత్త పథకంలో భాగంగా విద్యార్థుల కోసం మరిన్ని మినీ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఒక్కో తాలుకాలో కనీసం ఐదు బస్సులు నడిచేలా చూస్తామన్నారు. అవసరమైతే దీని కోసం అదనపు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధిలో రవాణా ముఖ్య పాత్ర పోషిస్తుందని బొమ్మై చెప్పారు. అందుకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థులకు ఉచిత పాసులు ఇస్తామని బడ్జెట్ సమావేశాల్లోనే చెప్పినట్లు గుర్తుచేశారు.

No comments:

Post a Comment