ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలు ఏకగ్రీవం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కే సూర్యనారాయణ, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మేరుగ మురళీధర్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఐదు ఎమ్మెల్సీ స్థానాలను పోటీ లేకుండానే వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 9 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు ఐదు స్థానాలు ఏకగ్రీవం కావడంతో మరో నాలుగు స్థానాలకు.. 3 పట్టభద్రులు, 2 టీచర్ల నియోజక వర్గాలకు మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16న కౌంటింగ్‌ చేపడతారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. పోలింగ్‌ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఎన్నికలు జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు: ఐదు స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడంతో మిగిలిన పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలు, శ్రీకాకుళం, కర్నూలు స్థానాలకే ఎన్నికలు జరగనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)