జుట్టు తక్కువగా ఉందని పెళ్లికి నిరాకరించిన వరుడు !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్‌, అయోధ్యలోని బికాపుర్‌ ప్రాంత యువతికి జమోలికి చెందిన యువకుడితో వివాహం జరగాల్సి ఉంది. వధువు తలపై జుట్టు తక్కువగా ఉండటం చూసిన వరుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. రాత్రంతా పంచాయితీ జరిపినా పెళ్లికొడుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోనని చెప్పేశాడు. దీంతో ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాయి. అదనపు కట్నం కోసమే వరుడి కుటుంబం పెళ్లికి నిరాకరించిందని, వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరుడు, అతడి తండ్రి సహా మరో 9 మంది బంధువులపై కేసు నమెదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)