ప్రపంచ కుబేరుల జాబితాలో 27వ స్థానానికి దిగజారిన అదానీ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 23 February 2023

ప్రపంచ కుబేరుల జాబితాలో 27వ స్థానానికి దిగజారిన అదానీ !


గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 25 స్థానాల నుండి దిగువకు పడిపోయారు. పోర్బ్స్ మరియు బ్లూమ్ బెర్గ్ సూచీల ప్రకారం ఫిబ్రవరి 22వ తేదీన గౌతమ్ అదానీ నికర ఆస్తుల విలువ 43.4 బిలియన్ల డాలర్ల కంటే తక్కువకు పడిపోవడంతో ప్రపంచంలోని 25 మంది సంపన్న బిలియనీర్ల జాబితా నుండి కిందికి పడిపోయారు. యూఎస్ కు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లో మ్యానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతుందని నివేదిక వెల్లడించిన తర్వాత గౌతమ్ అదానీ చిక్కుల్లో పడ్డారు. ఒకసారిగా అదానీ గ్రూప్ షేర్లన్నీ కుప్పకూలిపోవడం మొదలయ్యాయి. దీంతో అదానీ సంపద కొద్దిరోజులు వ్యవధిలోనే ఆవిరైపోయింది. హిండెన్ బెర్గ్ నివేదిక రాకముందు ఆసియాలో అత్యంత సంపన్నుడు, ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్నుడుగా గౌతమ్ అదాని ఫోర్స్ జాబితాలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఆయన వ్యక్తిగత నికర ఆస్తులు విలువ పడిపోయి 26వ స్థానానికి దిగజారారు. బుధవారం నాడు అదాని గ్రూప్ స్టాక్స్ మరోమారు పతనాన్ని చవి చూశాయి. దీంతో ఆయన వ్యక్తిగత నికర విలువ 3.6 బిలియన్లు ఆవిరి అయిపోయాయి. ప్రస్తుతం అదాని 26వ స్థానంలో నిలువగా, నైక్ యొక్క ఫీల్ నైట్ కుటుంబం 46.3 బిలియన్ల డాలర్ల నికర విలువతో 25వ స్థానంలో చేరింది. ఇక బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ లో కూడా గౌతమ్ అదానీ స్థానం పతనమైంది. బ్లూమ్ బెర్గ్ ప్రపంచ సంపన్నుల ఇండెక్స్ లో గౌతమ్ అదాని 29వ స్థానానికి పడిపోయారు. బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ లో అదానీ కంటే ముందు ఇటలీకి చెందిన గయోవన్ని ఫెర్రెరో 42.9 బిలియన్ డాలర్లతో ఉన్నారు. 121 బిలియన్ డాలర్ల నికర విలువతో 2023 సంవత్సరాన్ని ప్రారంభించిన గౌతమ్ అదాని ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్నమైన వ్యక్తిగా, అపర కుబేరుడుగా గుర్తింపు పొందారు. టెస్లా మరియు స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ను అధిగమించి మొదటి రెండు స్థానాలలోకి అడుగుపెడతాడని ఊహించారు. కానీ హిండెన్ నివేదిక అదానీ సామ్రాజ్యాన్ని తలకిందులు చేసింది. హిండెన్ బెర్గ్ నివేదికను అదానీ ఖండించినప్పటికీ, చట్టపరమైన చర్య తీసుకుంటామని బెదిరించినప్పటికీ, ఇన్వెస్టర్లలో విశ్వాసం కలిగేలా అదానీ మాట్లాడినప్పటికీ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు పతనాన్ని చూస్తున్నాయి. జనవరి 24వ తేదీ నుండి మార్కెట్ క్యాపిటలైజేషన్లో అదానీ గ్రూపు 135 బిలియన్ల డాలర్లకు పైగా నష్టాలను చవిచూసింది. అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ ,అదానీ పవర్ సహా అదానీ గ్రూప్ యొక్క పది కంపెనీల సంయుక్త విలువ ఈవారం ప్రారంభంలో 100 బిలియన్ డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. గౌతమ్ ఆదానీని ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 25 స్థానాల నుండి కూడా క్రిందికి తోసేసింది. 

No comments:

Post a Comment