మహిళల టీ20 వరల్డ్‌కప్‌ లో ఫైనల్​కు దక్షిణాఫ్రికా ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 24 February 2023

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ లో ఫైనల్​కు దక్షిణాఫ్రికా !


మహిళల టీ20 వరల్డ్‌కప్‌ హోరాహోరీగా సాగిన సెమీస్​లో ఇంగ్లాండ్​కు షాక్ ఇస్తూ దక్షిణాఫ్రికా ఫైనల్​కు దూసుకెళ్లింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్ టోర్న్​మెంట్​లో దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్​కు చేరుకుంది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్​తో తలపడనుంది. 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి పరాజయం చెందింది. అయితే ఒక దశలో ఇంగ్లాండ్​ సూనాయసంగా గెలుపొందుతుందని అభిమానులు ఆశించారు. కానీ కీలక సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు దూకుడు ప్రదర్శించడంతో ఇంగ్లీష్​ జట్టుకు ఓటమి తప్పలేదు. స్పీడ్‌స్టర్ అయబొంగా ఖాకా తన సూపర్​ బౌలింగ్‌తో సౌతాఫ్రికా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. నాలుగు ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను తీసింది. మరో బౌలర్​ షబ్నమ్ ఇస్మాయిల్ కూడా మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది. అయితే బ్యాటింగ్​లో ఇంగ్లాండ్​ జట్టుకు మంచి శుభారంభమే దక్కింది. ఓపెనర్లు డానిల్లె వ్యాట్, సోఫియా డంక్లే .. తొలి వికెట్‌కు 53 పరుగులు నమోదు చేశారు. ధాటిగా ఆడిన డంక్లే ఆరు ఫోర్లతో 28 రన్స్ చేసింది. వ్యాట్ కూడా ఆరు బౌండరీలతో 34 పరుగులు చేసింది. అలానే షివర్ 5 ఫోర్లతో 40 రన్స్​, కెప్టెన్ హీథర్ నైట్ రెండు సిక్సర్లతో 31 పరుగులు సాధించింది. కానీ వీరిద్దరూ ఔటైన తర్వాతే ఇంగ్లాండ్​ అసలు కష్టం మొదలైంది. వరుసగా వికెట్లను కోల్పోయింది. చివరికి లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. లౌరా, బ్రిట్స్‌ జోరు.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు కూడా మంచి శుభారంభమే దక్కింది. ఓపెనర్లు లౌరా వల్‌వర్డ్, తజ్మిన్ బ్రిట్స్ బాగా ఆడారు. వీరిద్దరూ కలిసి ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు పరుగెత్తించారు. లౌరా 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 53 రన్స్ సాధించింది. బ్రిట్స్ అయితే ఆరు బౌండరీలు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులను చేసింది. అలా వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 96 పరుగులు నమోదు చేశారు. కాప్ 4 ఫోర్లతో అజేయంగా నిలిచి 27 రన్స్​ చేసింది. దీంతో సౌతాఫ్రికా తన నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు సాధించింది. 

No comments:

Post a Comment