బాలుడి చికిత్సకు 11 కోట్లు ఒక్కడే దానం

Telugu Lo Computer
0


కేరళలోని పాలక్కడ్‭కు చెందిన సారంగ్ మీనన్, అదితి నాయర్ దంపతుల 15 నెలల బాలుడు నిర్వాన్‭కు అరుదైన వ్యాధి సోకింది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో నిర్వాన్ బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి చికత్స చేయాలంటే దాదాపు రూ.17.5 కోట్లు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియని నిర్వాన్ తల్లిదండ్రులు ఫేస్ బుక్‭లో ప్రకటన చేశారు. కొన్ని వారాల ముందు నుంచి క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించి బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ నిధుల సేకరణకు సాయం చేయాల్సిందిగా మలయాళ నటి అహనా కృష్ణ కూడా ప్రకటన చేశారు. సుమారు 17 లక్షల మంది తలో రూ.100 దానం చేస్తే రూ.17 కోట్లు జమవుతాయని ఆమె సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన నెటిజన్లు తమకు తోచినంత ఇస్తున్నారు. అలా ఫిబ్రవరి 19 వరకు రూ.5.42 కోట్లు వసూలు చేశారు. ఫిబ్రవరి 20న ఓ అనామక దాత రూ.11.6 కోట్లు దానం చేశాడు. అయితే తన వివరాలేవి వెల్లడించలేదు. తమ చిన్నారి చికిత్స కోసం మరో రూ.80 లక్షలు మాత్రమే కావాలని ఆ దంపతులు తెలిపారు. మరోవైపు చిన్నారికి అవసరమయ్యే ఇంజక్షన్‌ను విదేశాల నుంచి తెప్పిస్తారు. దీనిపై జీఎస్టీని తొలగించాలని ఆ దంపతులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. రూ.11.6 కోట్లు దానం చేసిన దాతలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)